Site icon NTV Telugu

Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు : బన్ని వాసు

Banni Vas

Banni Vas

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో వస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు.  విజయేందర్ దర్శకత్వం వహించగా. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ  సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీ వాసి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : DilRaju : సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కు డైరెక్టర్ దొరికేసాడు

బన్నీ వాసు మాట్లాడూతూ ” మా సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నాం. నా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు ఆడాలి.. అన్నీ హిట్ అవ్వాలి. మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. ఎదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు, ఇక్కడేదో తొక్కితే బన్నీ వాసు పడతాడు అనుకుంటున్నారు ఏమో.. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను చెప్తున్నా కదా మీ నెగిటివిటి నా వెంట్రుక. నా సంస్కారం ఎలాటిదంటే నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వొచ్చు కానీ తలమీద వెంట్రుక మాత్రమీ తీసి ఇస్తున్న నా నమస్కారం అలాంటింది. నేను అంతకు మించి ఏమి ఆలోచించను. నేను ఎప్పుడు పరిగెడుతూ ఉంటాను. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసిన నేను పట్టించుకోను మీ ఇష్టం వచ్చింది జరిగింది. నేను ట్రోలింగ్ చేసే వాళ్లకి చెప్తున్న నన్ను ట్రోల్ చేస్తున్నందుకు కనీసం డబ్బులైన ఎక్కువ తీసుకొండి. సినిమా రిలీజ్ అయినపుడు నెగిటివ్ ఇంకా ఎక్కువ చేస్తారు చేసుకోండి. బీ పోజిటివ్. అందరి సినిమాలు ఆడాలి’ అని అన్నారు.

 

Exit mobile version