Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Ravana Screen Time in Ramayana Part 1: నితీశ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రూ.4000 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. పార్ట్-1 ఈ దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. తాజాగా కన్నడ స్టార్ యశ్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రామాయణ పార్ట్-1లో యశ్ పాత్రకు గంటకు పైగా స్క్రీన్ టైమ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రావణుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో.. యశ్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. రావణుడి పాత్ర కోసం కన్నడ స్టార్ 55 రోజులు షూటింగ్లో పాల్గొన్నాడట. రావణుడి పాత్రను అత్యంత భారీ స్థాయిలో, ప్రత్యేకమైన లుక్‌తో చూపించేందుకు మేకర్స్ భారీగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రావణుడి ఆగ్రహం, వ్యక్తిత్వం, శక్తిని తెరపై ప్రభావవంతంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్.
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్-1లో రావణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యం సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా.. అది విజువల్ వండర్‌గా నిలిచింది. ట్రైలర్లో రావణుడిగా యశ్ విశ్వరూపం చూపాడు. గంటకు పైగా స్క్రీన్ టైమ్ ఉండడంతో యశ్ నటనా బీభత్సం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్.. సోదరి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. రావణుడి తల్లి కైకసిగా సీనియర్ నటి శోభన నటిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!