రవి అరసు డైరెక్షన్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సినిమా “మకుటం”. పూజా కార్యక్రమాలతో షూట్ మొదలైంది, విశాల్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే నెల తిరక్కుండానే డైరెక్టర్‌తో హీరోకి క్రియేటివ్ క్లాష్ వచ్చిందని టాక్. దాంతో తానే డైరెక్ట్ చేయాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ “ఇది నేను ఊహించలేదు, కానీ పరిస్థితులు నన్ను ఈ నిర్ణయానికి నడిపించాయి అని చెప్పిన విశాల్, “ఇకపై నేను ‘మకుటం’ సినిమా డైరెక్టర్‌గా కూడా ఉంటాను” అని ప్రకటించాడు.
Also Read : Bollywood : మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేయనున్న హ్యుమా ఖురేషీ
విశాల్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు, గతంలో కూడా మిస్కిన్ డైరెక్షన్ లో చేసిన తుప్పరి వాలన్ సక్సెస్ ఫుల్ మూవీ అయితే, ‘తుప్పరి వాలన్ 2’ తెలుగులో ‘డిటెక్టివ్’ సమయంలో డైరెక్టర్ మిస్కిన్ ప్రవర్తన వల్ల లండన్‌లో ఒంటరిగా బాధపడినట్టు విశాల్ అప్పుడే ఎమోషనల్‌గా చెప్పుకున్నాడు. అప్పుడే ఫ్యాన్స్ కు తెలిసిపోయింది ఈ హీరోకి వర్క్‌పై ఉన్న డెడికేషన్ ఎంతో ఇప్పుడు అదే నిబద్ధతతో “మకుటం”ని కాపాడాలనే ఉద్దేశ్యంతో నే డైరెక్టర్ గా కూడా మారినట్టు చెప్పుకున్నాడు విశాల్. ఆ మధ్య కనీస బడ్జెట్ పెట్టలేని నిర్మాతలు సినిమాలు చేయొద్దని, ఒకవేళ చేస్తే రిటర్న్స్ ఎక్స్ పెక్ట్ చేయొద్దని, ఆ డబ్బు భూమి మీద పెట్టుబడిగా పెడితే రిటర్న్స్ బాగుంటాయని.. చిన్న సినిమాల నిర్మాతలపై చేసిన కామెంట్స్‌తో కూడా విశాల్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ డైరెక్షన్ స్టెప్ మాత్రం ఇండస్ట్రీలో ఒక బోల్డ్ మూవ్‌గా చూస్తున్నారు. హీరోగా, ప్రొడ్యూసర్‌గా, ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా విశాల్ తన వేర్వేరు ఫేసెస్ చూపిస్తున్నాడు. మరి డైరెక్టర్‌గా సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.