యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ ఎంట్రీ ఇస్తే ఇప్పడు లయ మరోసారి రీ ఎంట్రీ ఇస్తూ లక్ పరీక్షించుకుంటోంది.
Also Read : Re Release : జూలై రీ-రిలీజ్ సినిమాల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
స్వయంవరంతో కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగుమ్మాయి లయ.. 2000వ దశకంలో హిట్ హీరోయిన్. గ్లామర్ కన్నా హోమ్లీ లుక్కులో మెస్మరైజ్ చేసిన లయ కెరీర్ పీక్స్‌లో ఉండగానే డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిలయ్యింది. కానీ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్ వదులుకోలేపోయిన సీనియర్ స్టార్ బ్యూటీ.. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ పాపులరయ్యింది. దీంతో యాక్టింగ్‌పై ఉన్న ప్యాషన్‌ను భర్త గుర్తించి ఎంకరేజ్ చేసే సరికి ఎగిరి టాలీవుడ్‌లో వాలిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చిన కూడా ఇతర కారణాల వలన చేయలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నితిన్ తమ్ముడులో ఫుల్ తెంత్ రోల్ చేస్తోంది లయ. ఈ సినిమాలో లయకు కీలక మైన రోల్ దక్కింది. లయ పాత్ర చుట్టూ అల్లిన కథతో వస్తున్న తమ్మడు తనకు హిట్ ఇస్తుందని లయ ధీమాగా ఉంది. మరి జులై 4న తమ్ముడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.
