రోజురోజుకి ఓటీటీల హవా పెరిగిపోతోంది. హాలీవుడ్ లోని టాప్ స్టార్స్, సీనియర్ యాక్టర్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ని పక్కకు పెట్టలేకపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకమైన కామెడీ వెరైటీ స్పెషల్ లో ఆయన అలరించనున్నాడు. విల్ స్మిత్ ఫస్ట్ ఎవర్ కామెడీ షో ఇదే కావటం విశేషం!
నెట్ ఫ్లిక్స్ చెబుతోన్న దాని ప్రకారం స్పెషల్ కామెడీ షో ఈ సంవత్సరం చివరికల్లా ప్రేక్షకులకి అందుబాటులో ఉంటుంది. గంట పాటూ కొనసాగే విల్ స్మిత్ షోలో సెలబ్రిటీ గెస్ట్స్ ఉంటారు. అలాగే, ఆసక్తికరమైన మాటామంతి జరుగుతుంది. కామెడీ స్కెచెస్, మ్యూజికల్ పర్ఫామెన్సెస్, ఇంకా పలు విధాలైన కామెడీ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి.
నెట్ ఫ్లిక్స్ పై స్ట్రీమింగ్ అవ్వనున్న అప్ కమింగ్ కామెడీ షోని వెస్ట్ బ్రూక్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా… విల్ స్మిత్ హోస్ట్ గానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహారిస్తాడు. చూడాలి మరి, హాలీవుడ్ కామెడీ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ పొందుతాడో…