మంచు మనోజ్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదు. యాక్షన్ డ్రామా భైరవంతో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు మంచు మనోజ్. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయినా మనోజ్ రీ ఎంట్రీ మాత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని తన క్యారెక్టర్‌ని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక రీసెంట్ గా వచ్చిన మిరాయ్ సినిమాతో మంచు మనోజ్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది.
Also Read : Koratala Siva : వెంకీమామ – కొరటాల శివ.. ప్లానింగ్
కానీ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించాడు మనోజ్. అయితే హీరోగా మనోజ్ తరువాత సినిమాలు సిచుయేషన్ ఏంటనేది క్లారిటీ రానట్టే ఉంది. ఒకసారి ఆ సినిమాలను పరిశీలిస్తే ‘అహం బ్రహ్మస్మి’ మనోజ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్. 2020 లోనే సినిమా అనౌన్స్ చేసినా ఇంతవరకు పట్టాలెక్కలేదు. పవర్‌ఫుల్ డైలాగ్స్, హై ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ ఎక్కడ వరకు వచ్చిందో ఎవరికి తెలియదు. మరోవైపు “వాట్ ద ఫిష్” మాత్రం పూర్తి కామెడీ, సస్పెన్స్‌తో యూత్‌ని ఫుల్ ఎంటర్‌్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. అది కాకుండా ఇటీవల డేవిడ్ రెడ్డి అనే మరో సినిమాను ప్రకటించాడు. ఇవి కాకుండా మరికొన్ని డిస్కషన్స్ లో ఉన్నాయి. అంత గ్యాప్ తర్వాత ఇంత స్పీడ్ తో రావడం మంచి పరిణామం అయితే ఈ రాబోయే సినిమాలలో ఏ సినిమా మనోజ్ కెరీర్‌ని టర్న్ చేస్తుందో చూడాలి.