Site icon NTV Telugu

Puri Jagannadh: డైరెక్టర్ పూరి పరిస్థితేంటి?.. అసలేమైంది?

Puri Jagannadh

Puri Jagannadh

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయడాని టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలు పెట్టాడు.

ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. సీనియర్ బ్యూటీ ట‌బు కీలక పాత్రలో న‌టిస్తోంది. ఈ చిత్రంకు ‘స్ల‌మ్ డాగ్’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. ఆ మధ్య స్లమ్ డాగ్ గురించి గట్టిగా చర్చ జరిగింది. విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్ హీరోతో పూరి ఎలాంటి సినిమా చేస్తాడా? అని స‌ర్వ‌త్రా ఈ ప్రాజెక్ట్‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. కానీ, ఇప్పుడు మాత్రం ఎలాంటి చడీ చప్పుడు లేదు.

Also Read: IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ఇదే!

నిజానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులే అవుతోంది. కానీ పూరి టీమ్ ఎందుకో ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కనీసం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో అసలు పూరి-సేతుప‌తి ప్రాజెక్ట్ పరిస్థితేంటి? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణాలు ఏమైనా జెట్ స్పీడ్‌లో షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. సినిమా విడుదల, బిజినెస్ విషయాల్లో వెనబడినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓటీటీ డీల్ కూడా పూర్తి కాలేదని భోగట్టా. మరి పూరి ‘స్లమ్ డాగ్’ ఎప్పుడు సౌండ్ చేస్తుందో చూడాలి.

Exit mobile version