అజిత్ హీరోగా నటిస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ విదాముయర్చి నుండి టీజర్ వచ్చింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్‌తో నింపేశారు మేకర్స్. ఇది డై హార్డ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో విఘ్నేశ్ శివన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. యాక్చువల్‌గా అజిత్ 62 ఫస్ట్ విఘ్నేశ్ శివన్ చేయాల్సింది. స్టోరీ నేరేట్ కూడా అయిపోయింది. అయితే స్క్రిప్ట్ వర్క్ అజిత్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. చివరకు ఆ ప్లేసులో మజీజ్ తిరుమనేనికి అవకాశం ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో. అదే విదాముయర్చి.. టీజర్ చూశాక.. చాలా మంది ఇది 1997లో వచ్చిన హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ రీమేక్‌గా చెప్పుకుంటున్నారు. సీన్స్ రిలేటెడ్‌గా ఉండటంతో రీమేకే అంటూ ఫిక్స్ అయ్యారు
Sandeep Raj: సైలెంటుగా పెళ్లి చేసుకున్న హీరోయిన్-డైరెక్టర్
దానికి తోడు రీసెంట్లీ విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. అజిత్‌తో వర్కౌట్ కాకపోవడంపై స్పందించాడు. ఫహాద్ ఫాజిల్ ఆవేశం లాంటి స్టోరీ అజిత్ కోసం ప్రిపేర్ చేశానని, తన స్క్రిప్ట్ కొంత వరకు అదే జోన్‌లో ఉందని చెప్పాడు. కచ్చితంగా ఆయనకు డిఫరెంట్ మూవీ అయ్యేదన్నాడు. ఈ స్క్రిప్ట్ నచ్చకే అజిత్.. శివన్‌ను సైడ్ చేశాడు. దీంతో ఫ్యాన్స్.. అయ్యో అజిత్ చేతులారా వదులుకున్న స్టోరీ ఇదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఉంటే.. మా హీరో ప్రాణం పోసి ఉండేవాడని, సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉండేదని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆవేశంలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. ఎంత చెప్పినా తక్కువే. మరీ ఎక్కువగా సీరియస్ అండ్ యాక్షన్ డ్రామా తోనే నెట్టుకొస్తున్న అజిత్.. ఫహాద్‌ను మైమరపించేవాడేమో?