NTV Telugu Site icon

Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు

Untitled Design (77)

Untitled Design (77)

ఈ మధ్య కాలంలో సినిమా మంచి హిట్ అందుకోవాలి, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి అంటే గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే. ఎందుకంటే OTT లు వచ్చిన కానుంచి థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం జనాలు దాదాపు తగ్గించేశారు. రేటింగ్‌ని బట్టి చూస్తున్నారు. అయితే స్టార్ హీరోల నుంచి ఏదైనా ఒక మూవీ రివ్యూ వచ్చింది అంటే మాత్రం జనాలు ఎగబడి చూస్తారు. ఇందులో మహేష్ బాబు నుంచి రివ్యూ అంటే మామూలు విషయం కాదు. ఆయన అందరిలా కాదు చిన్నా పెద్ద తేడా లేకుండా తనకు తెలిసిన లేదా కలిసి పని చేసిన సంస్థ, దర్శకుడు ఇలా ఎవరి నుంచి చెప్పుకోదగ్గ మంచి మూవీ వస్తే మిస్ కాకుండా చూసి ట్విట్టర్ లో తన అభిప్రాయం తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల దర్శకులు కూడా మహేష్ మద్దతు కోసం పాకులాడుతున్నారు.

Also Read: War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..

కోలీవుడ్ నుంచి తాజాగా విడుదలైన చిత్రం ‘డ్రాగన్’. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తమిళంతో పాటు తెలుగు స్టేట్స్ లోనూ విడుదలవగా, యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగ్గ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ మీట్ జరుపుకుంది. ఇందులో భాగంగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ.. ‘ నా ‘ఓ మై కడవులే’ మూవీ చూసి మహేష్ బాబు ట్వీట్ చేయడం వల్ల ఇక్కడి ప్రేక్షకులతో పాటు, భారీ సంఖ్యలో ఆడియన్స్ థియేటర్లకు వచ్చి. నా సినిమాను మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘డ్రాగన్’ మూవీ ని కూడా మహేష్ బాబు చూడాలని కోరుకుంటున్నా. ఎవరి ద్వారా అయినా ఆయనకు నా విన్నపం చేరుతుందటని నమ్ముతున్న’ అంటూ తెలిపాడు. దర్శకుడు ఇలా పబ్లిక్‌గా తన సినిమా చూడమని రిక్వెస్ట్ చేయడం చిన్న విషయం కాదు.