మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం సినీ ప్రియుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ బ్లాక్‌బస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇటీవల మాట్లాడిన అయాన్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణను ఆకర్షణీయంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడానికి తాను ఎంతో సమయం వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ సినిమా భారతీయ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించనుందని ఆయన చెబుతున్నారు.
Also Read: Shekar Kammula : శేఖర్ కమ్ముల మూవీలు.. సోషల్ మెసేజ్ లు..!
YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా 2019లో విడుదలైన ‘వార్’ చిత్రం, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటనతో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ ఫ్రాంచైజీలో కొనసాగింపుగా ‘వార్ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను ఒకే తెరపై చూడాలనే అభిమానుల కల నెరవేరనుంది. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ, “‘వార్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించిన ఒక బ్లాక్‌బస్టర్. దానికి కొనసాగింపుగా ‘వార్ 2’ను రూపొందించడం నాకు ఒక పెద్ద బాధ్యతగా అనిపించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు, నా తొలి చిత్రాన్ని తీసినట్లుగా ఉత్సాహంగా, ఉద్వేగంగా భావించాను. ఈ ఫ్రాంచైజీకి ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌తో పాటు, ఎన్టీఆర్, హృతిక్ అభిమానులను కూడా ఈ సినిమా ఆకర్షించేలా చేయాలని భావించాను. ఇది నాకు ఒక సవాల్‌గా, అదే సమయంలో స్ఫూర్తిదాయకమైన అవకాశంగా అనిపించింది,” అని అన్నారు.
Also Read: Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
“ఇండియన్ సినిమాలో ఇద్దరు అతిపెద్ద స్టార్లు ఒకే వేదికపై కలవడం అనేది అభిమానులకు ఒక పండగ లాంటిది. వారి మధ్య సంఘర్షణను అందరికీ కనెక్ట్ అయ్యేలా, ఆకర్షణీయంగా రూపొందించడానికి ఎక్కువ సమయం వెచ్చించాం. యాక్షన్ సన్నివేశాలను అత్యంత ఉత్కంఠభరితంగా, ఆధునిక సాంకేతికతతో చిత్రీకరించాం. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుంది. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు గూస్‌బంప్స్‌తో ఉత్సాహంగా ఫీలవుతారని నమ్ముతున్నాం,” అని అయాన్ తెలిపారు.