Site icon NTV Telugu

Bollywood : వార్ 2ఎఫెక్ట్.. రంగంలోకి రైటర్ కమ్ నిర్మాత

Yrf

Yrf

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు స్పై యూనివర్శ్‌కు ఎండ్ కార్డ్ పడే టైం దగ్గరపడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read : PR : అనుకోని పరిస్థితిలో వంద కోట్ల ‘యంగ్ హీరో’.. మాట వినేవారు లేరుగా

వార్2 రిజల్ట్ నెక్ట్స్ స్పై థ్రిల్లర్ మూవీ ఆల్ఫాపై ఎఫెక్ట్ చూపుతోంది. నయా దర్శకుడు శివ్ రావైల్ ఈ సినిమాను హ్యాండిల్ చేయగలడా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయాన్ ముఖర్జీకి బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాన్ని తీసిన ఎక్స్ పీరియన్స్ ఉంది. కానీ ఆల్ఫాను డీల్ చేస్తున్న శివ్ రావైల్‌కు మాధవన్ ది రైల్వే మ్యాన్ అనే ఒక్క వెబ్ సిరీస్ తీసిన అనుభవం తప్ప మరో ఎక్స్ పీరియన్స్ లేదు. ఇప్పుడు ఇదే శివ్ మేకింగ్ పై అనుమానం వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఆలియాను ఎలా ప్రజెంట్ చేస్తాడా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఆల్ఫాలాంటి ఓ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ అందులోనూ ఫస్ట్ ఫీమేల్ స్పై థ్రిల్లర్ సరిగ్గా డీల్ చేయగలడా అన్న డౌట్స్ వస్తున్నాయి. స్పై థ్రిల్లర్ యూనివర్శ్‌ను భారీ స్థాయికి తీసుకెళదామని ప్లాన్ వేసుకుంటున్న యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు వార్2 రూపంలో గట్టి ఝలక్ తగలడం ఆల్ఫాపై నీలి నీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగుతున్నాడట ఈ మూవీ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ ఆదిత్య చోప్రా. ఇప్పటి వరకు కథలు మాత్రమే అందించిన ఆదిత్య ఈసారి స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేస్తున్నాడట. వార్2లో జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా స్క్రీన్ ప్లేలో భారీ ఛేంజస్ చేస్తున్నట్లు టాక్. స్పై యూనివర్శ్‌‌పై ఆడియన్స్ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడట. కథలో కొన్ని రిపేర్లు కొన్ని సీన్స్ రీషూట్ చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version