VT15 : సూపర్ ఫన్ ప్రోమోతో అదరగొట్టిన మేకర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్‌లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి అధికారికంగా ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేయనప్పటికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ట్రెండ్ అవుతోంది. అయితే అప్పుడే టీం ప్రమోషన్ స్టార్ట్ చేశారు.. అదేంటి అనుకుంటున్నారా.
Also Read: Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజాగా ఈ మూవీకి సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియోను.. చిత్ర బృందం డిఫరెంట్‌గా వదిలింది. ఈ వీడియోలో రాత్రివేళ కమిడియన్ సత్య కారులో వరుణ్ తేజ్ ఆఫీసుకి వెళ్లగా రూమ్ అంతా చీకటిగా ఉంది. వరుణ్ డిప్రెషన్‌తో చీకట్లో కూర్చున్నాడేమోనని పొరపాటు పడిన సత్య, మోటివేషన్ ఇచ్చేలా పెద్ద పెద్ద డైలాగులతో రెచ్చిపోతాడు. ఇంతలో కరెంట్ రావడంతో అసలు సంగతి తెలిసి తనే షాక్ తింటాడు. ఆ తర్వాత ఇద్దరూ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండగా, డైరెక్టర్ వచ్చాడు.. ఇందులో సత్య కూడా ఉన్నాడు అనడంతో.. సత్య తనకు కథ వినిపించమరి కోరుతాడు. దీంతో ఓ కొరియన్ అమ్మాయి ప్రత్యక్షం అయ్యి సత్యకి కథ గురించి చెబుతూ ఉంటుంది. అయితే చివర్లో కరెంట్ పోవడం తో సత్యకి ఎవరో మసాజ్ చేస్తారు. చేతులు వేసి తాము కాదని మిగిలిన ముగ్గురు చెప్పడంతో సత్య హడలిపోతాడు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
Eesari BLOCKBUSTER EXPRESS route 😎
Korea’s chills meet India’s thrills❤️🔥#VT15 Shoot begins with a super fun promo💥💥
Brace yourselves for an Indo-Korean horror comedy that’s going to be hauntingly hilarious and hilariously haunting 🐉🥳
Mega… pic.twitter.com/0PjFeXxwFs
— UV Creations (@UV_Creations) March 26, 2025
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!