‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్‌లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో అయితే సూర్య నటించిన ’24’ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. సూర్య సినిమాలన్నింటిలో ’24’ 1.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఉత్తర అమెరికాలో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఈ వసూళ్లను ‘విశ్వనాథ్ & సన్స్’ మూడు రోజుల్లో దాటేసింది. వీకెండ్ వసూళ్లతో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మండే ఎగ్జామ్ పాస్ అయింది. వర్కింగ్ డే నాడు కూడా బుకింగ్స్ బాగున్నాయి. దీంతో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ₹135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదే జోరుతో ఇంకో నాలుగు రోజుల్లో ₹200 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నాయి.
ఏ క్లాస్, బి క్లాస్ అని కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ‘విశ్వనాథ్ & సన్స్’ సక్సెస్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గర కావడంతో, ఏజ్ లిమిట్ లేకుండా ‘విశ్వనాథ్ & సన్స్’ అన్ని వయసుల వారిని థియేటర్స్‌కు రప్పిస్తుంది. వెంకీ సెన్సిబుల్ కథ రాసుకున్నా, ఎమోషనల్ మేకింగ్‌తో మెప్పించడం సినిమాకు ప్లస్ అయింది. జీవీ ప్రకాష్ మ్యూజిక్, సూర్య, రాధిక, మమితా బైజు పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ‘విశ్వనాథ్ & సన్స్’ కథలోకి తీసుకెళ్ళాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించింది.

