మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. మరికొన్ని సినిమాలు ఓటిటిల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ‘పాగల్’ కూడా ఓటిటీలో విడుదల కానుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఇప్పటికే అమెజాన్, ఆహా వంటి ఓటీటీ వేదికలు మేకర్స్ తో చర్చలు ప్రారంభించారట.
అయితే అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించకపోవడంతో మేకర్స్ కూడా డిజిటల్ ప్లాట్ఫాంలతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులో అధికంగా పెరుగుతుండడంతో అనేకమంది చిత్ర నిర్మాతలకు ఓటీటీ ప్లాట్ ఫాంలో తమ సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.