విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘పాగల్’. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేదీ సినిమా. ‘హిట్’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ కి బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు ఉంది. విశ్వక్ తో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెరకెక్కించిన క్రేజీ లవ్ స్టోరీ చిత్రం ‘పాగల్’. థియేటర్లలో విడుదల కాని ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. విశ్వక్ సేన్ కి థియేటర్ బిజినెస్ క్రేజ్ గా ఉండటంతో మేకర్స్ ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేశారు. ఈ సినిమాతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేస్తామంటున్నారు. అయితే ఓటీటీలను కాదని థియేటర్ల కోసం ఎదురు చూసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. మరి ‘పాగల్’ వాటికి భిన్నంగా అక్కడా, ఇక్కడా సత్తా చాటుతాడేమో చూడాలి.