తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు.
Also Read:Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!
‘రాట్ససన్’ మొదటి భాగం అభిమానులను ఉర్రూతలూగించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజానికి ఇదే సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి హీరోగా రాక్షసన్ పేరుతో తెరకెక్కి రిలీజ్ అయింది. మరోపక్క విష్ణు విశాల్, తన నిర్మాణ సంస్థ విష్ణు విశాల్ స్టూడియోజ్ బ్యానర్‌లో రూపొందిన కొత్త చిత్రం ‘ఓ హో ఎండన్ బేబీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం జూలై 11, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో విష్ణు విశాల్ సోదరుడు రుద్ర నటిస్తున్నారు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్‌లతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తూ, తమిళ సినిమాలోకి అడుగుపెడుతోంది.
