Site icon NTV Telugu

Manchu Vishnu: పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు తగ్గిన రోజే టికెట్ హైక్ అడుగుతా!

Manchu Vishnu

Manchu Vishnu

కన్నప్ప సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచి, తెలంగాణలో పెంచకపోవడం పై మీడియా నుంచి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసలు టికెట్ హైక్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. “ఏ రోజు థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలు తగ్గిస్తారో, తెలంగాణలో ఆ రోజు నేను మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువమంది కుటుంబాలతో వెళ్లాలి, వాళ్లకు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.

ALso Read:Coolie : గట్టి పోటీలో ‘కూలీ’ రైట్స్ దక్కించుకున్నది ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని సెంటర్ల వరకే టికెట్ రేట్ 50 రూపాయలు పెంచుకుంటామని అడిగాం, అన్ని సెంటర్లలో కాదు, కొన్ని సెంటర్లలోనే, అది కూడా హైక్లాస్ టికెట్లకు మాత్రమే 50 రూపాయల పెంపు గురించి కోరాము” అని ఈ సందర్భంగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. నిజానికి సినిమా థియేటర్ల వ్యవస్థను ప్రేక్షకులకు దూరం చేస్తోంది ఈ పాప్‌కార్న్ ధరలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని దిల్ రాజు సహా టాలీవుడ్‌లో తోపు ప్రొడ్యూసర్లు చాలామంది ఒప్పుకున్నారు, కానీ ఎందుకు ఆ రేట్లు తగ్గించే విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు? ఇదే విషయాన్ని మరోసారి మంచు విష్ణు ప్రస్తావించడం గమనార్హం.

Exit mobile version