Rustum: తనతో తానే భీకర యుద్ధం.. ‘అపరాధ భావమే’ అతిపెద్ద శత్రువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్’ (Primeshow Entertainment) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విరాట్ కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి ‘రుస్తుం’ (Rustum) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి, ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా, ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ‘రుస్తుం’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంతో కనిష్క గంధం రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకు వెండితెరపై చూడని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో స్టైలిష్ విజువల్స్, ఇంటెన్స్ వాతావరణం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా అసలు బలం యాక్షన్ మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న లోతైన భావోద్వేగం! ఒక మనిషి తనతో తానే చేసుకునే అంతర్గత యుద్ధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా ‘అపరాధ భావం’ (Guilt) అనేది ఒక మనిషికి ఎంత పెద్ద శత్రువుగా మారుతుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌ను బలమైన డ్రామా, యాక్షన్ అంశాలతో మేళవించి దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దారు. భారీ స్థాయిలో, వినూత్నమైన విజువల్ ప్రెజెంటేషన్‌తో రూపొందుతున్న ‘రుస్తుం’ టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం నుంచి మరిన్ని సంచలన అప్డేట్స్ ఉంటాయని చిత్రబృందం స్పష్టం చేస్తోంది. మరి విరాట్ – కనిష్క గంధం కాంబినేషన్లో వస్తున్న ఈ ‘రుస్తుం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Rustum: తనతో తానే భీకర యుద్ధం.. ‘అపరాధ భావమే’ అతిపెద్ద శత్రువు
-
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
-
CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
-
RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
-
Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!