అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమా ఏమాయచేసావే. తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు/. ఎవువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళ్, హిందిలో రీమేక్ చేసారు.
తమిళ్ లో ఈ సినిమాను ‘విన్నైతాండీ వరువాయా’ గా తెరకెక్కించాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. యంగ్ హీరో శింబు, అందాల తార త్రిష జంటగా నటించారు. ఈ సినిమా మూలంగా వీరిద్దరి మధ్య కొన్నాళ్లు ప్రేమాయణం నడిచింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. కాగా గత రెండు సంవత్సరాలుగా రీరిలీజ్ సినిమాల హావ గట్టిగా నడుస్తోంది. ఆ నేపథ్యంలో ‘విన్నైతాండీ వరువాయా’ సినిమాను తమిళంలో రీరిలీజ్ చేసారు మేకర్స్. రీరిలీజ్ లోను సూపర్ హిట్ అయిన ఈ సినిమా మూడు సంవత్సరాలకు పైగా కంటిన్యూగా ప్రదర్శింపబడుతూ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ‘విన్నైతాండీ వరువాయా’ చెన్నై అన్నా నగర్ లోని PVR VR ముల్టీప్లెక్స్ గత 1000 రోజులుగా రోజు ప్రదర్శింపబడుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రీరిలీజ్ లో ఇది ఒక సెన్సేషన్ రికార్డు. 2010 లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని శింబు, త్రిష మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. మున్ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.