Ghaati : అనుష్కకి జోడీగా దేశీ రాజు వచ్చాడ్రోయ్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం. ఈ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు, నేడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్, పాత్ర గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఫెరోషియస్ గా ఉంది. గ్లింప్స్ లో దట్టమైన అడవులు, కఠినమైన ఘాట్ ప్రాంతాల గుండా పోలీసులు విక్రమ్‌ను వెంబడిస్తున్నట్లు ప్రజెంట్ చేశారు. తరువాత అతను గూండాలతో యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. విక్రమ్, అనుష్క తమ బైక్‌లను పక్కపక్కనే నడుపుతూ, ఒకరినొకరు చూసి నవ్వుతూ, వారి పాత్రల మధ్య పవర్ ఫుల్ కెమిస్ట్రీని సూచిస్తూ లైటర్ రొమాంటిక్ టచ్‌తో గ్లింప్స్ ముగుస్తుంది.
Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
గ్లింప్స్ హై-ఆక్టేన్ యాక్షన్‌ను ప్రామిస్ చేయడమే కాకుండా, ఒక అద్భుతమైన ప్రేమ కథ కూడా ఉన్నట్టు హింట్ ఇస్తోంది. ఈ గ్లింప్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఘాటీ అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ , ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది.
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?