విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎక్కువగా రాత్రి షెడ్యూల్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ సినిమాలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు ముందు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తాజాగా ఆమె పాత్ర గురించి మరో రకమైన ప్రచారం మొదలైంది.
Also Read:Kota Srinivasa Rao : కన్నీటి వీడ్కోలుతో ముగిసిన కోట అంత్యక్రియలు
ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. నిజానికి, టబు ఇప్పుడు హీరోయిన్‌గా కాకపోయినా తల్లి, అత్త వంటి పాత్రలలో మెరుస్తోంది. అప్పుడప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ లేడీ రోల్ ఎలా ఉండబోతుందని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
