Site icon NTV Telugu

Vijay Deverakonda: హిందీలో కింగ్డమ్ పేరు మారింది.. ఏంటో తెలుసా?

Vijay Devarakonda’s Kingdom

Vijay Devarakonda’s Kingdom

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కింగ్డమ్ అనే టైటిల్‌తోనే రిలీజ్ కాబోతోంది, కానీ హిందీలో మాత్రం ఈ టైటిల్ దొరకలేదు. అందుకే హిందీ వెర్షన్‌కి సామ్రాజ్య అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కింగ్డమ్ అంటే రాజ్యం, ఒక రాజు పాలించే భూభాగం. ఇది ఇంగ్లీష్ పదం, అందుకే తెలుగు ఆడియన్స్‌కి ఈ టైటిల్ కొత్తగా, స్టైలిష్‌గా అనిపిస్తుంది.

Also Read:Kishan Reddy : ఓరుగల్లు 40 ఏళ్ల కల సాకారమైంది..

కానీ హిందీలో కింగ్డమ్ అనే టైటిల్‌ని ఉపయోగించడానికి ఆ టైటిల్ వేరే నిర్మాతలకు రిజిస్టర్ చేసుకున్నారు.. అందుకే అక్కడ సామ్రాజ్య అనే పదాన్ని ఎంచుకున్నారు. సామ్రాజ్య అంటే కూడా రాజ్యం లేదా సామ్రాజ్యం అనే అర్థమే. ఈ పదం హిందీలో గంభీరంగా, గొప్పగా సౌండ్ చేస్తుంది. కింగ్డమ్ కి సామ్రాజ్య దాదాపు సమానమైన అర్థాన్నే ఇస్తుంది, కానీ హిందీ ఆడియన్స్‌కి ఈ పదం ఎక్కువగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఆలోచన. ఇక ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా సితార బ్యానర్ మీద సినిమాను రూపొందిస్తున్నారు.

Exit mobile version