Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..

Vijay Deverakonda, Rowdy Janardhana, Vishal Mishra,

Vijay Deverakonda, Rowdy Janardhana, Vishal Mishra,

విజయ్ దేవరకొండ సినిమాల్లో కథలతో పాటు ఆడియో ఆల్బమ్స్‌కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘రౌడీ జనార్దన’ చిత్రాన్ని మ్యూజికల్‌గా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం కోసం ఇద్దరు టాప్ కంపోజర్లను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి మొదట ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవ్వగా.. ఇప్పుడు ఆయనతో పాటు ‘టాక్సిక్’ (Toxic), ‘యానిమల్’ ఫేమ్ బాలీవుడ్ సెన్సేషన్ విశాల్ మిశ్రా (Vishal Mishra) కూడా ఈ మెగా ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు.ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కలయికతో ‘రౌడీ జనార్దన’ ఆల్బమ్‌ బాధ్యతలను మేకర్స్ చాలా స్మార్ట్‌గా డివైడ్ చేశారు.

ఇక ఈ సినిమాలోని లవ్, ఎమోషనల్.. మాస్ సాంగ్స్‌కు విశాల్ మిశ్రా మ్యూజిక్ సమకూర్చనున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో పాటు సౌత్‌లోనూ బ్లాక్‌బస్టర్ ట్రాక్స్ ఇస్తున్న విశాల్ మిశ్రా మార్క్ మెలోడీలు ఈ సినిమాకు పెద్ద అసెట్ కానున్నాయి. రూరల్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను క్రిస్టో జేవియర్ హ్యాండిల్ చేయబోతున్నారు. ‘ప్రేమలు’ చిత్రంతో మ్యాజిక్ చేసిన క్రిస్టో.. ఈ సినిమాలో తన మార్క్ ఇంటెన్స్ స్కోర్‌తో థియేటర్లను ఊపేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఆల్బమ్ ప్రేక్షకులకు సరికొత్త ఆడియో-విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇక ఈ ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు స్కై హై లో ఉన్నాయి.ఈ ఏడాది డిసెంబర్ (December 2026) లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఊరమాస్ లుక్, విశాల్-క్రిస్టోల మ్యూజికల్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.