టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను చిన్న పాత్రలతో ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఫ్లాప్ లు ఎదురైన తన మార్కెట్ మాత్రం దెబ్బ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఆయన తమ్ముడు ఆనంద్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ స్థాయికి చేరకపోయినా, ఆనంద్‌కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
Also Read : Babla Mehta : గుండెపోటుతో ప్రముఖ సింగర్ మృతి
అయితే ప్రజంట్ విజయ్ ‘కింగ్‌డమ్’ మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్, తన తమ్ముడి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘ఆనంద్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ సినిమాల విషయంలో నేను ఆయనకు సలహాలు, సూచనలు ఇవ్వను, ఆనంద్ చెప్తే వింటా, కానీ ఏ సినిమాలో నటిస్తున్నాడో, డైరెక్టర్ ఎవరో, కథ ఏమిటో నేను అడగను. భవిష్యత్తులో నా కొడుకు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి’ అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఇండస్ట్రీలో అన్నయ్యగా విజయ్ ఇచ్చే మద్దతు ఆనంద్‌కి ఎంతో విలువైనది. కానీ సినిమా విషయంలో మాత్రం ఆయన స్టాండ్ తీసుకోన్నన్నారు.
