Site icon NTV Telugu

Kingdom: చెప్పిన డేటుకే దిగుతున్నాడు!

Kingdomj

Kingdomj

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మళ్లీ రావా లాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది, అందులో మొదటి భాగం కింగ్డమ్ పేరుతో మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Read More:Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..

అయితే, అదే రోజున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి, దీంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు బుక్ మై షోలో స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ సినిమా రిలీజ్ అవ్వచ్చని అనుకున్నారు. అయినా సరే, కింగ్డమ్ సినిమాకు సంబంధించి సీజీ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ నెలాఖరికి, అంటే మే 30వ తేదీన రిలీజ్ చేయడం కష్టమేనా అనే మరో వాదన కూడా మొదలైంది.

Read More:Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు

అయితే, ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ పోస్టర్లో మాత్రం మే 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాయి. కాబట్టి, ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మేకర్లు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట ఈటీవీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version