Site icon NTV Telugu

మహేష్ బాబు, విజయ్ దేవరకొండలకు మాత్రమే ఆ స్థానం !

Vijay Deverakonda and Mahesh Babu On Power List 2021 of Hello Magazine

పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చేరుకోవడానికి కొంచం దూరంలోనే ఉన్నారు.

Read Also : బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?

విజయ్ గతంలో తాను మహేష్ కు పెద్ద అభిమానిని అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన అభిమాన నటుడితో సమానంగా ‘హలో!’ మ్యాగజైన్ లో ఆయన స్థానం సంపాదించుకోవడం విశేషం. ఇక మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ముందు ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు “సర్కారు వారి పాట” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తయింది. ప్రస్తుత షెడ్యూల్‌లో ఈ హీరోపై బ్యాంక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ “లైగర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నారు.

Exit mobile version