బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?

నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నెట్స్ట్ తాను చేయబోయే వరుస సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం బోయపాటి “అఖండ”లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోందని వెల్లడించారు. అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం, హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు.

Read Also : ‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు

దీంతో అప్పటినుంచి బాలయ్య-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనే ప్రచారం ఊపందుకుంది. దానికి కారణం లేకపోలేదు. హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఇంతవరకూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎక్కువ సినిమాలు చేశారు. అందుకే బాలయ్యతో త్రివిక్రమ్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ అటు బాలయ్య గానీ, ఇటు త్రివిక్రమ్ గానీ స్పందించలేదు. కానీ వారి అభిమానులు మాత్రం ఈ కాంబో వర్క్ అవుట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-