Site icon NTV Telugu

Kingdom: అబ్బే.. మళ్ళీ షూట్ చేయాల్సిందే!

Kingdom

Kingdom

విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది.

Also Read: Shiva Rajkumar : శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకున్న.. కమల్ వివాదం

దాదాపు నెల క్రితమే పూర్తి కావడంతో, ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించి రీ-షూట్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కట్ చూసిన తర్వాత గౌతమ్ అలాగే ఆయన టీమ్ కొన్ని పోర్షన్స్ రీ-షూట్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ టీమ్ గోవాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసింది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతోంది.

Also Read: Rakul: రకుల్‌ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!

విజయ్ దేవరకొండ కూడా ఈ షూట్‌లో భాగమైనట్లు అంటున్నారు. మరోపక్క, సినిమాకి రీ-రికార్డింగ్ చేయడానికి అనిరుద్ కూడా ఇంకా సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఎలాగో రిలీజ్ వాయిదా పడింది కాబట్టి, తనకు కూడా కాస్త సమయం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. రీ-షూట్స్ జరిగినా పర్వాలేదు, కంటెంట్ మాత్రం అదిరిపోవాలని నాగవంశీ కూడా టీమ్‌కి సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version