Site icon NTV Telugu

Parashakti : ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్

Kollywood

Kollywood

కోలీవుడ్ మల్టీటాలెంటెడ్‌ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో శివకార్తీకేయన్, విజయ్ ఆంటోనీల మధ్య సైలెంట్ వార్ నడిచినట్లు కోలీవుడ్ టాక్. చివరకు లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టైటిల్ శివకు త్యాగం చేసి తన ప్రాజెక్టుకు టైటిల్ మార్చుకున్నాడు ఈ బిచ్చగాడు హీరో.

Also Read : KOTA : కోటశ్రీనివాసరావు కోసం కదలివచ్చిన జనసేనాని

తమిళంలో శక్తి తిరుమగన్, తెలుగులో భద్రకాళిగా పేరు మార్చాడు. ఈ మూవీని స్కామ్, పొలిటికల్ డ్రామాతో యాక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ అరుణ్ ప్రభు. ఈ ప్రాజెక్టును సొంత నిర్మాణ సంస్థపై విజయ్ ఆంటోనీ నిర్మించి మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న తమిల్‌లో శక్తితిరుమగన్ గా, తెలుగులో భద్రకాళిగా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు విజయ్ ఆంటోనీ. అంటే సరిగ్గా శివకార్తీకేయన్ మదరాసి వస్తున్న రోజే శక్తి తిరుమగన్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో. మదరాసి వస్తుందని తెలిసి కూడా తన సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నాడంటే పరాశక్తి టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్లున్నాడు విజయ్. లేక మదరాసి ఆటైంకి తప్పుకునే ఛాన్సైనా ఉండాలి.

Exit mobile version