కరోనా సెకండ్ వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. సినీ పరిశ్రమ కూడా కొంతమంది ప్రముఖులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా విషాదం నింపింది. ఆమె ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రాండ్రం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించారు కవిత.