Site icon NTV Telugu

Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!

Dil Raju Venky Atluri

Dil Raju Venky Atluri

తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్‌గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీలోనే ఉండాలని నిర్ణయించుకొని దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.

Also Read:Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?

అందులో భాగంగానే ‘మిస్టర్ మజ్ను’ కథను దిల్ రాజుకు చెప్పగా, కథ నచ్చి తనకు ఇచ్చేయమని అడిగారని, కానీ తాను ఇవ్వనని చెప్పడంతో, “నీ మీద నమ్మకం కుదరాలంటే కొన్నాళ్లు నాతో ట్రావెల్ చేయాలి” అన్నారని తెలిపారు. అలా ‘కేరింత’ సినిమాకు పని మొదలుపెట్టానని, ఒక సందర్భంలో ఆ సినిమా ఆగిపోయిందని, తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత మళ్లీ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో కూడా తాను వెళ్లేవాడినని, ఒక సందర్భంలో సీన్ నచ్చకపోతే ఆన్‌సైట్ ఇంప్రూవ్‌మెంట్ అడిగేవారని, అలాంటి టెన్షన్‌లో రాయడం వల్లే తాను దర్శకుడిగా సులభంగా సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. దిల్ రాజు వద్ద రైటర్‌గా టెన్షన్‌లో రాయించడం తన కెరీర్‌కు బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.

Exit mobile version