Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!
- వెంకీ అట్లూరి దిల్ రాజు వద్ద రైటర్‌గా పనిచేసిన అనుభవం తన దర్శకత్వ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెల్లడి!
- ‘మిస్టర్ మజ్ను’ కథను దిల్ రాజుకు చెప్పగా, నమ్మకం కోసం కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారన్న వెంకీ అట్లూరి!
- ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న వెంకీ, టెన్షన్లో రాయడం తన విజయ రహస్యమని తెలిపారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్‌గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీలోనే ఉండాలని నిర్ణయించుకొని దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.
Also Read:Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
అందులో భాగంగానే ‘మిస్టర్ మజ్ను’ కథను దిల్ రాజుకు చెప్పగా, కథ నచ్చి తనకు ఇచ్చేయమని అడిగారని, కానీ తాను ఇవ్వనని చెప్పడంతో, “నీ మీద నమ్మకం కుదరాలంటే కొన్నాళ్లు నాతో ట్రావెల్ చేయాలి” అన్నారని తెలిపారు. అలా ‘కేరింత’ సినిమాకు పని మొదలుపెట్టానని, ఒక సందర్భంలో ఆ సినిమా ఆగిపోయిందని, తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత మళ్లీ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో కూడా తాను వెళ్లేవాడినని, ఒక సందర్భంలో సీన్ నచ్చకపోతే ఆన్సైట్ ఇంప్రూవ్మెంట్ అడిగేవారని, అలాంటి టెన్షన్లో రాయడం వల్లే తాను దర్శకుడిగా సులభంగా సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. దిల్ రాజు వద్ద రైటర్‌గా టెన్షన్లో రాయించడం తన కెరీర్‌కు బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!