టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను పరిశీలిస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు లాక్ చేసారు.
Also Read : Manikandan : మరోసారి ఫ్యామిలీ డ్రామాతో వస్తోన్న మణికందన్
అయితే టాలీవుడ్ నిర్మాతలపై జరిపే సోదాలపై సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరో విక్టరీ వెంకటేష్ స్పందించాడు. తన సినిమా నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై మాట్లాడూతూ దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదు. అసలు ఎవరి మీద చేస్తున్నారో కూడా నాకు తెలియదు అన్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ తనిఖీలపై స్పందించారు. అనిల్ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో దిల్ రాజుపైనే కాదు చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నామని మేము అంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారు. ప్రతి రెండేళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణం. నేను సుకుమార్ ఇంటి పక్కన లేను, ఫిబ్రవరి వాళ్ల ఇంటి పక్కకు వెళ్తున్నాను. నాపై ఐటీ దాడులు జరగ లేదు’ అని అన్నారు.