హీరోయిన్స్‌పై విమర్శలు కొత్తేమీ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి పరిమితులు దాటితే, ఆ నటి నుంచి బహిరంగ స్పందన వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది నటి వేదిక. మహారాష్ట్రకు చెందిన వేదిక ఇప్పటికే 37 ఏళ్లు. అయినప్పటికీ ఆమె అందం, యవ్వన కాంతి చూసి వయసు అంచనా వేయడం కష్టమే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయి కోసం ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా..
Also Read : Rhea : సుశాంత్ కేసులో నేను నిర్దోషి.. అంటే నమ్మలేకపోయాను – రియా చక్రవర్తి కన్నీటి జ్ఞాపకాలు
గ్లామరస్ లుక్‌లో కనిపించినప్పుడల్లా తనపై తప్పుదారి పట్టించే కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.. “హీరోయిన్లు అంటే చాలు.. విమర్శలు చేయడానికి ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దుస్తులు కాస్త గ్లామరస్‌గా ఉంటే, ఏకంగా ఆ నటీమణి క్యారెక్టర్‌నే తప్పుపడతారు. ఇది చాలా తప్పు. అందుకే నేను దుస్తుల గురించి ఎవరైనా విమర్శించినా పట్టించుకోను. నేను బికినీ ధరించి నటించిన నాకేం ఇబ్బంది లేదు. ఎవరో ఏమంటారనే భయమూ లేదు. నాకు నాకే బాగా తెలుసు. తప్పు దారిలో ఆలోచించే వాళ్ళు మారితే మంచిది” అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం వేదిక తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తూ బిజీగా ఉంది. గ్లామర్, టాలెంట్ రెండింటినీ సమతూకంగా చూపించగల నటి అని మరోసారి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది.