వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇందువదన’. వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా చిత్ర టిజర్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. గ్రామీణ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. హీరోహీరోయిన్లు పాతకాలపు వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ వెనకున్న అసలు కథేంటో తెలియాలంటే ‘ఇందువదన’ సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.