Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Update: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్, జక్కన్న కలయికలో వస్తున్న తొలి సినిమా కావడం ఒక విశేషమైతే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్‌తో పాటు ఓ గ్లింప్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో సినిమా కథ, ఇతర కీలక అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే వచ్చే నవంబర్లోనూ వారణాసి నుంచి మరో భారీ రివీల్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈసారి అయినా సినిమా కథకు సంబంధించిన కీలక విషయాలు, మరిన్ని పాత్రలు లేదా కొత్త విజువల్స్‌ను చిత్ర బృందం వెల్లడిస్తుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్తోనే భారీ హైప్ సొంతం చేసుకున్న వారణాసి.. తదుపరి రివీల్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేదు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
ఈ చిత్రంలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. రాబోయే రోజుల్లో చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్‌లో భారీ రివీల్ ఉంటుందనే ప్రచారంపై అధికారిక స్పష్టత వస్తే.. అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!