ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ ను కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.
తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’.. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఐశ్వర్యరాయ్, విక్రమ్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాశ్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఐశ్వర్య రాయ్‌తోపాటు శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి షూటింగ్ విరామ సమయంలో ఐశ్వర్య, అభిషేక్, ఆర్యాధ్యని కలిశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘ ఐశ్వర్య రాయ్, అభిషేక్, వాళ్లమ్మాయి ఆరాధ్యను నిన్న రాత్రి కలిశాను. ఇది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం.. దీనికి కారణమైన మా నాన్నకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది.
