Vaibhav Sooryavanshi: పదాలు సరిపోవడం లేదు.. తరానికొక్కడు.. ప్రత్యేకమైన ప్లేయర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav praise Vaibhav Sooryavanshi: యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా మంగళవారం దోహాలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ తరఫున కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి లిస్ట్-ఏ క్రికెట్ రికార్డులను తిరగరాశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌పై భారత క్రికెట్ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా వైభవ్ ఆటను కొనియాడాడు.
వైభవ్ కేవలం 28 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో 2023లో ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 29 బంతుల్లో నెలకొల్పిన లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అధిగమించాడు. అంతటితో ఆగకుండా 40 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. గత ఏడాది బిహార్ తరఫున అరుణాచల్ ప్రదేశ్‌పై 59 బంతుల్లో 150 పరుగులు చేసి నెలకొల్పిన తన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇక డబుల్ సెంచరీని కేవలం 52 బంతుల్లోనే సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బౌస్ పేరిట ఉండేది. ఫోర్డ్ ట్రోఫీలో కాంటర్బరీ తరఫున ఒటాగోపై 103 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read
- Anupama Parameswaran-Bhogi: 'భోగి' ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
- Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
- Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
- Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ ఏడు ఫోర్లు, ఏకంగా 28 సిక్సర్లు బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2018లో డార్సీ షార్ట్ సాధించిన 23 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. చివరకు 204 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైనా.. అప్పటికే పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌పై సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు నువ్వే నాకు స్ఫూర్తి. ప్రత్యేకమైన ప్రతిభ, ప్రత్యేకమైన ప్లేయర్ నువ్’ అంటూ ప్రశంసించాడు. ’53 బంతుల్లో 28 సిక్స్‌లు, 204 పరుగులు. క్రికెట్లో ఇది నమ్మశక్యం కాని ఇన్నింగ్స్. అద్భుతమైన ప్రతిభ ఇది. వైభవ్ తరానికొక్కడు’ అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా వైభవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘అద్భుతమైన ప్రతిభ. ఇంత చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించడం వైభవ్ నిర్భయమైన ఆటతీరును, అసాధారణ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. పెద్ద కలలు కంటూ ఇలాగే వెలుగొందాలి యువ ఛాంపియన్’ అని పేర్కొన్నాడు. ‘కేవలం 53 బంతుల్లో 204 పరుగులు, 28 సిక్సర్లు. వైభవ్ రికార్డులు బద్దలు కొట్టడం కోసం ఎదురుచూడటం లేదు.. క్రికెట్ చరిత్రనే తిరగరాస్తున్నాడు. భవిష్యత్తులో అతడు సూపర్‌స్టార్‌గా ఎదగబోతున్నాడు’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కొనియాడాడు. ‘వైభవ్ ఇటీవలి ప్రదర్శనలను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ఇలాగే కొనసాగి దేశానికి గర్వకారణంగా నిలవాలి’ అని ఎస్. బద్రీనాథ్ ఆకాంక్షించాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పదాలు సరిపోవడం లేదు.. తరానికొక్కడు.. ప్రత్యేకమైన ప్లేయర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
US Tariffs on India: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. భారతీయ వస్తువులపై అమెరికా భారీ టారిఫ్‌లకు సిద్ధం!
-
Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
-
Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..