Kalinga: ఆసక్తి రేకెత్తించేలా ‘కళింగ’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Vijayendra Prasad launched the intriguing First Look of Kalinga :‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో రాబోతున్నాడు. ధృవ వాయు ‘కళింగ’ అనే సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం కుడా చేస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.
Krishna Vamsi: నన్ను చూసి ఆఫీస్ బాయ్ అనుకున్నారు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడాతో ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతోందని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సినిమాలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీని, విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఎజి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నరేష్ వేణువంక ఎడిటర్.ఇక అడుకలం నరేన్, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!