Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి. కానీ, సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్.. రెండు, మూడో రోజున 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, నాలుగో రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఐదో రోజు మండే నాడు ఉస్తాద్ లెక్క మరింత తగ్గింది. రెండు కోట్ల లోపే నెట్ వసూలు చేసింది. దాంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఐదు రోజుల టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ. 62 కోట్లకు చేరుకోగా గ్రాస్ రూ. 73 కోట్లకు పైగా ఉంది. ఓవర్సీస్‌లో రూ. 10 కోట్లకు పైగా వసూలు చేయగా.. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఐదు రోజులకు గాను రూ. 83 కోట్లకు పైగా గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
మరి కలెక్షన్స్ ఇలా ఉంటే, ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది ట్రేడ్ వర్గాల్లో. అలాగే.. డైరెక్టర్ హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే టాక్ కూడా మొదలైంది ఇండస్ట్రీలో. నిజానికి, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో డిజాస్టర్ చూశాడు హరీష్. దీంతో.. ఎలాగైనా సరే పవర్ స్టార్ సినిమాతో హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ, ఉస్తాద్ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో హరీష్ తర్వాతి సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. కానీ, బాలయ్య మాత్రం నెక్స్ట్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే.. మెగాస్టార్‌తో కూడా ఓ సినిమా ఉంటుందని ఉస్తాద్ ప్రమోషన్స్‌లలో భాగంగా హరీష్ చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతం చిరంజీవి లైనప్ కూడా భారీగా ఉంది. బాబీ, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి, ఈ కాంబినేషన్స్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. మరి హరీష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు? స్టార్ హీరోతో సెట్ అయితే మాత్రం.. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హరీష్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read: Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
తాజావార్తలు
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!