ఇండియా మోస్ట్ క్రేజియస్ట్ టాక్ షో గా అన్‌స్టాపబుల్’ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి రెండు సీజన్స్ కంప్లైట్ చేసుకున్న అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. యంగ్ హీరోలతో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్ ల అల్లరి మాములుగా లేదు. కాగా ముచ్చటగా మూడో సీజన్ UnstoppableWithNBK ఇటీవల స్టార్ట్ చేసారు. సీజన్ – 3 ఫస్ట్ గెస్ట్ గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు అయన నటిస్తున్న లక్కీ భాస్కర్ టీమ్ హాజరయ్యింది.
Also Read : Tollywood : అసలే హిట్లు లేవు.. దానికి తోడు వరుణుడు..
ఈ నేపథ్యంలో సీజన్ -3 ఇంతకు ముందు వాటి కంటే భిన్నంగా, రెండు సీజన్స్ ను మించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సెకండ్ ఎపిసోడ్ లో బ్లాస్టింగ్ గెస్ట్ ఉండబోతున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నాడని తెలుస్తోంది. బన్నీతో పాటుగా పూష -2 టీమ్ రష్మీక, సుక్కు,మైత్రి నిర్మాతలు అటెండ్ అవుతారని సమాచారం. అలాగే రానున్న ఎపిసోడ్ లో చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీయార్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరి ఎపిసోడ్ లో చేసిన హంగామా కంటే ఈ సారి ఆ హంగామా మరింత ఎక్కువ ఉంటుందని, అన్ స్టాపబుల్ స్టేజ్పై బాలయ్య బన్నీ రచ్చ రచ్చ చేయనున్నారని తెలుస్తోంది.