NTV Telugu Site icon

Ukku Satyagraham : గద్దర్ ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం విడుదల డేట్ ఇదే..

Gaddar

Gaddar

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తీశారు సత్యారెడ్డి. నవంబర్ 29న ఉక్కు సత్యాగ్రహం చిత్రం విడుదల చేయనున్నారు.

Also Read : Kanguva : కంగువ నైజాం థియేటర్స్ పంచాయితీ ఏంటంటే..?

ఈ సందర్భంగా నిర్మాత సత్యా  రెడ్డి మాట్లాడుతూ ” విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కుసత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించా.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సినిమాను తెరకెక్కించా. ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో ఉక్కు సత్యాగ్రహం సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ ఉద్యమ నేత గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కుసత్యాగ్రహం. ఈ సినిమాలో అయన పాట రాసి ఆలపించారు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించారని ఆరోపణలు రావడంతో పాటు , ఉద్యమ నేత గద్దర్ మరణం తో సినిమా విడుదల సెన్సార్ ఆలస్యం అయ్యింది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ,ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాడేవారు ఈ సినిమాలో నటించారు. గద్దర్ సినిమాలో అరగంట పాటు తెరపై కనిపిస్తారు. స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలకంటే, సమాజానికి మేలు చేసే ఉక్కుసత్యాగ్రహం లాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలి, ఈ సినిమా గద్దర్ కు నివాళి ఇస్తున్నాం” అని సత్యారెడ్డి అన్నారు.