UBS-SreeLeela: శ్రుతి హాసన్ మాదిరి.. శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
- శ్రుతి హాసన్ కెరీర్‌ను మార్చేసిన ‘గబ్బర్ సింగ్’
- వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న శ్రీలీల
- శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో హీరోయిన్‌ల కెరీర్‌లు ఒక్క సినిమాతోనే మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు శ్రుతి హాసన్ వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడిన సమయంలో.. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఒక్క హిట్‌తో శ్రుతి స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకున్నారు. ఆపై చేసిన అన్ని సినిమాలు ఆమె రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో కూడా శ్రుతి నటించారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితిలో ఉన్న మరో హీరోయిన్ శ్రీలీల. పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ శ్రీలీల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.
శ్రీలీల టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి క్రేజ్ మాత్రం తగ్గలేదు. యంగ్ ఏజ్, డాన్స్ స్కిల్స్, ఎనర్జీతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ భారీ హిట్ మాత్రం ఇంకా ఆమె ఖాతాలో పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. సాలిడ్ బ్లాక్‌బస్టర్ లేకపోవడం శ్రీలీల కెరీర్‌పై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆమెకు కీలకంగా మారనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘ఉస్తాద్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతుందనే సమాచారం వినిపిస్తోంది.
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
పవన్‌తో స్క్రీన్ షేర్ చేయడం అంటేనే హీరోయిన్లకు కెరీర్‌లో పెద్ద బ్రేక్ అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. గతంలో శ్రుతి హాసన్‌కు ‘గబ్బర్ సింగ్’ ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో.. అదే తరహాలో శ్రీలీలకు ‘ఉస్తాద్’ కూడా గేమ్ ఛేంజర్ కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 26న విడుదలకు సిద్ధమవుతున్న ఉస్తాద్ ఫలితం శ్రీలీల భవితవ్యాన్ని నిర్ణయించనుందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అయితే.. ఆమె కెరీర్ మరో లెవల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..