Site icon NTV Telugu

Tollywood : పోటా పోటీగా అందాల ఆరబోత.. సినిమాకు ప్లస్ అవుతుందా

Pooja Vs Kiara

Pooja Vs Kiara

ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‍కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ మార్కెట్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది సన్ పిక్చర్స్.

Also Read : Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..

కూలీ ఎక్కడో ఫాస్ట్ ఫార్వాడ్‌గా ఉంది అనుకున్న టైంలో వార్ 2 కూడా ట్రైలర్ దింపి కాస్త కవర్ చేసేసింది. కానీ ఇది చాలదు అనుకున్న టైంలో ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది. మోనికాను ధీటుగా ఎదుర్కొనే గ్లామర్ అస్త్రాన్ని సంధించింది. హృతిక్, కియారా రొమాంటిక్ సాంగ్ ఊపిరి ఊయలగా ఫస్ట్ సింగిల్‌తో వార్ 2పై ఎక్స్‌పెక్టేషన్స్ కి ఊపిరి పోసింది. కియారా గ్లామర్ డోస్‌, గ్రీక్ గాడ్‌తో రొమాన్స్ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చేలా కనిపిస్తోంది. ఉపిరి ఊయల సాంగ్ లో బికినితో కియారా రచ్చ లేపింది. ఇలా తమ తమ సినిమాల ఓపెనింగ్స్‌కు అటు పూజా, ఇటు కియారా తమ స్టఫ్ ఇచ్చేశారు. అటు పూజా హెగ్డే ఇటు కియారా ఇద్దరు పొడుగు కాళ్లతో అందాల ఆరబోతతో యూత్ ను థియేటర్స్ రప్పించేందుకు పోటీ పడుతున్నారు. రిలీజ్ కు మరి కొద్దీ రోజలు మాత్రమే ఉన్న కూలీ, వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ లోను పోటీ పడుతున్నాయి.

Exit mobile version