Site icon NTV Telugu

Trivikram: పాపం.. కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్!

Trivikram

Trivikram

గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆయన అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అల్లు అర్జున్‌కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ కన్ఫ్యూషన్‌లో ఉన్నాడని అంటున్నారు.

Also Read:Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఆయన అల్లు అర్జున్ కోసం ఒక మంచి పాన్ ఇండియా సినిమా సిద్ధం చేసుకున్నాడని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయడానికి కొన్నేళ్లు పడుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ రామ్ చరణ్‌కి ఒక కథ, వెంకటేష్‌కి ఒక కథ చెప్పాడు. వీరిద్దరికీ కలిసి మరో కథ చెప్పాడు.

Also Read:Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

అలా ఆయన ముందు ప్రస్తుతానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్‌తో సినిమా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రామ్ చరణ్‌తో సినిమా కనుక ఆలస్యమైతే, ఆయన వెంకటేష్ సినిమా చేయొచ్చు. అయితే ఆయన ఎవరితో సినిమా చేయాలనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటివరకు ఆయన కన్ఫ్యూజన్‌లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version