Mazaka: ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ని చాలా ఎంజాయ్ చేస్తారు: త్రినాధరావు నక్కిన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
మజాకా ఎలా ఉండబోతోంది ?
-మజాకా వందశాతం హిట్ ఫిల్మ్. ఆ రేంజ్ ఏమిటనేది ఫస్ట్ షో పడ్డాక డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా సూపర్ వుంది, హిట్ ఫిల్మ్ అన్నారు. ఈ సినిమాకి పబ్లిసిటీ టైం సరిపోలేదనిపిస్తోంది,టైం తక్కువైన మాట నిజమే. నిర్మాతలు వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. శివరాత్రి రిలీజ్ చేయాలని అందరం డే అండ్ నైట్ కష్టపడ్డాం. శివరాత్రి సినిమాకి మంచి డేట్.
Also Read
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
- Tamannaah Bhatia: 'రాగిణి 3' షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ఈ కథ ఎప్పుడు విన్నారు ? ఈ కథకి బ్రోడాడీ స్ఫూర్తి ఉందా ?
-‘ధమాకా’ సమయంలోనే ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పారు. రావు రమేష్ ని ద్రుష్టిలో పెట్టుకొని చెప్పారు. హీరోగా ఎవరు చేస్తారని అడిగాను. ఈ కథ కొందరి దగ్గరరికి వెళ్ళింది. ఫైనల్ గా రావు రమేష్ గారి కాంబినేషన్ లోనే వచ్చింది. నిజానికి ఈ కథని సందీప్ కిషన్ ఒప్పుకోవడం చాలా గ్రేట్. లేదండీ. నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు.
మజాకా కథ ఏమిటి ?
సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్ళ ఎప్పటికైన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే వారి తపనే ఈ కథ. దిని కోసం వాళ్ళు పడే బాధలు, ప్రయత్నాలు ఫుల్ ఫన్ జోన్ లో వుంటాయి. చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్ గా వుంటుంది.
అన్షు గారి ఛాయిస్ ఎవరిది ?
-ఆ క్యారెక్టర్ కి ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ వున్న ఓ ఆర్టిస్ట్ తో చేయిస్తే బావుంటుందని అనుకున్నాను. అప్పుడు మన్మధుడులో అన్షు అయితే ఎలా ఉంటుందని ప్రసన్నతో అన్నాను. తర్వాత నిర్మాత రాజేష్ గారు ఆమెని సంప్రదించారు. నేనే ఫోన్ లో మాట్లాడిన ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను. ఆమెకు తెలుగు రాదు, అయినప్పటికీ చాలా కష్టపడి నేర్చుకొని ప్రతి డైలాగ్ కి అర్ధం తెలుసుకొని నటించడం చాలా అనందంగా అనిపించింది. ఒక అమ్మ క్యారెక్టర్ ఎలా చూడాలని అనుకుంటారో అన్షు క్యారెక్టర్ అలా వుంటుంది.
మజాకాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన వుంది. చివర్లో డబుల్ మజాకా అని వేశాం. అయితే మరో టైటిల్ తో వెళ్ళాలా అనే ఐడియా కూడా వుంది. రవితేజ గారితో డబుల్ ధమాకా చేస్తే బావుంటుంది. అదే ప్రయత్నం చేస్తున్నాను.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!