సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతోన్నారు.
దాదాపు 14 కోట్లతో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్టోబర్ 18న టీజర్‌తో పాటుగా, రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించబోతోన్నారు. అయితే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే నేపథ్యంలో తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘త్రిముఖ’ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా, ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.
‘‘త్రిముఖ’ జర్నీ మాకెంతో ప్రత్యేకం. ఐదు భాషల్లో సినిమాను నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. అక్టోబర్ 18న విడుదలయ్యే టీజర్‌తో మేం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించామో అందరికీ తెలుస్తుంది. ఈ టీజర్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతుందని మేం నమ్ముతున్నాం. డిసెంబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ విడుదల కోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామ’ని టీం తెలిపింది.
‘త్రిముఖ’ సినిమాలో సన్నీ లియోన్‌తో పాటుగా యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ తదితరులు నటించారు. ఈ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కృష్ణ మాస్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా బాబీ మాస్టర్ పని చేశారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఆర్కే, అఖిల బలరామ్ పని చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి అల్తి వ్యవహరించారు.
