Site icon NTV Telugu

Uppu Kappurambu: ఉప్పు కప్పురంబు ట్రెయిలర్.. ఇదేదో బానే ఉందే!

Uppukappurambu

Uppukappurambu

అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండో తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్‌పై రాధిక లావూ నిర్మాణ బాధ్యతలు నిర్వహించగా, అని ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి కలం నుంచి జాలువారిన ఈ కథలో సుహాస్, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మెరవనుండగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా జులై 4 నుంచి ప్రైమ్ వీడియోలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్‌తో, ఇంగ్లీష్ సహా 12 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:Konda Murali: సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..

1990ల నాటి చిట్టి జయపురం అనే చిన్న గ్రామంలో ఈ కథ ఆరంభమవుతుంది. ఈ పల్లెటూరు ఓ వింత సమస్యతో అట్టుడికిపోతోంది—అక్కడ చనిపోయిన వారిని పాతిపెట్టేందుకు స్థలం లేని పరిస్థితి! ఇలాంటి తరుణంలో కొత్తగా గ్రామాధికారిగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ (కీర్తి సురేష్) అడుగుపెడుతుంది. అయితే, ఓ మహిళ అధికారంలో ఉండటం స్థానికులకు రుచించక, ఆమెను ఎగతాళి చేస్తూ ఆటపట్టిస్తారు. గ్రామ సమస్యలను చక్కదిద్దాలని పట్టుదలతో ఉన్న అపూర్వ, ఊరి కాటికాపరి చిన్న (సుహాస్) సాయం తీసుకోవాలనుకుంటుంది. కానీ, వీరి ప్రయత్నాలు ఊహించని గందరగోళానికి దారితీస్తాయి. స్మశానంలో స్థలం కోసం లక్కీ డ్రా నుంచి మొదలై, గ్రామంలో నాటకీయ పరిణామాల వరకు—ఈ ట్రైలర్ హాస్యం, చమత్కారం, భావోద్వేగాలతో నిండిన రోలర్‌కోస్టర్ రైడ్‌లా అనిపిస్తుంది. సామాజిక వ్యంగ్యంతో కూడిన ఈ కథ, అనూహ్యమైన సంఘటనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.

Exit mobile version