కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర టీజర్‌లో హీరో యష్, బ్రెజిలియన్ నటి బీట్రిజ్ టోఫేన్ బాఖ్ మధ్య ఉన్న కొన్ని అశ్లీల కార్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సీన్లపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వివాదం చెలరేగింది. దాంతో చిత్ర యూనిట్, నటి బీట్రిజ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Dadasaheb Phalke Biopic: ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ఈజ్ ఆన్.. మార్చికి పోస్ట్ పోన్!
ఈ పరిణామాల నేపథ్యంలో నటి బీట్రిజ్ టోఫేన్ బాఖ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 13 వరకు యాక్టివ్‌గా ఉన్న ఆమె అకౌంట్.. ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ వివాదం కారణంగానే నటి బీట్రిజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజెన్స్ చర్చిస్తున్నారు. 2014లో తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్రెజిల్ మోడల్.. ‘టాక్సిక్’ సినిమాతో భారతీయ వెండి తెరపై మెరవనున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ఈ వివాదం ఆమెను చుట్టుముట్టింది.