Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శకులు నటులుగా మారి, తమ సినిమాలతో పాటు తమ స్నేహితుల సినిమాలలో కూడా కనపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒకరిద్దరు నిర్మాతలు కూడా అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు.
అయితే, ఒక టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ మాత్రం ఒక ఆసక్తికరమైన పాత్రతో నటనా రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… తమ సర్కిల్లో ఒక నిర్మాత రంగ ప్రవేశం చేస్తున్నాడని, దానికోసం ఒక సపరేట్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వెనుక ఒక నిగూఢమైన హింటుందని తెలుస్తోంది.
Also Read
వారి క్యాంప్ కి చెందిన ఒక నిర్మాత టాలీవుడ్ లో ఒక విలన్ పాత్రతో ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం నిర్మాతగా మాత్రమే పరిచయమైన అతను, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అతని పాత్ర అదిరిపోయిందని, అతని ఎంట్రీ తో సినిమా ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుందని నమ్ముతున్నారు.
ఒక యంగ్ హీరో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతనితో సై అంటే సై అనే పాత్రలో సదరు నిర్మాత నటిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాక, ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఒక సీనియర్ డైరెక్టర్ కూడా కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి దర్శకత్వానికి బ్రేక్ తీసుకున్న ఆయన, ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?